మనీ 2 ఇండియా - I

అమెరికా నుండి ఇండియా మనీ పంపించాలి అనుకొనేవారికి కొన్ని సూచనలు:
డబ్బు పంపించే మార్గాలు: చాలా రకాలుగా మనం అమెరికా నుండి డబ్బులు ఇండియా కి పంపించవచ్చు. వాటిలో నాకు తెలిసిన మార్గాలు.
1) ICICI Money 2 India (www.money2india.com)
2) State Bank of India (www.onlinesbi.com/glsus)
3) Remit 2 India (www.remit2india.com)
4) CITI Bank (www.online.citibank.co.in)
5) Western Union (www.westernunion.com)
పై పద్దతులు ఎలా ఉపయొగించుకోవాలి: ముందుగా దేని ద్వారా డబ్బు పంపించాలో నిర్ణయించుకొన్న తర్వాత వాటికి సంబదించిన websites కి వెళ్ళి మన personal details ఇచ్చి register అవ్వాలి. Register అయ్యెటప్పుడు మన remittance account (ఏ account నుండి అయితే మనం డబ్బు పంపుతామో ఆ account details ఇవ్వాలి) . Registration process ఆమోదించటానికి 1-3 days పట్టవచ్చు, మనకి ఆమోదం e-mail ద్వారా అందుతుంది. అప్పుడు మన remittance account లో 1-Deposit & 2-with drawls చూడగలము, deposit 1$ కంటే తక్కువుగా ఉంటుంది, దానిని balance చేయటానికి 2-with drawls చూడగలము. అలా మన remittance account లో transactions చూసిన తర్వాత account register అయ్యెటప్పుడు ఇచ్చిన user-id మరియు password తో మనం ఆ corresponding website లో మన remittance account లో పడిన 3 amounts enter చేయాలి. ఆ తర్వాత మనకి complete approval వస్తుంది. ఆ తర్వాత మనం destination account details add చేసుకొని డబ్బులు ఇండియా పంపవచ్చు. ఇలా పంపించటానికి మనకి 4-5 working days పడుతుంది.
పైన పద్దతిలో లాభాలు:
1) 1000$ కంటే ఎక్కువ పంపగోరువారికి service charge ఉండదు.
2) Conversion rate కొంచం బాగానే ఉంటుంది.
పైన పద్దతిలో నష్టాలు:
1) 1000$ కంటే తక్కువ పంపించాలి అనుకొంటే 2$ service charge కట్ట వలసి వస్తుంది.
2) మనం conversion calculation rate సరిగ్గా నిర్ణయించుకోవటం కొంత కష్టమయినపనే, ఎందుకంటే డబ్బులు పూర్తిగా వెళ్ళటానికి 4-5 పనిదినాలు పడుతుంది కాబట్టి.
Western Union: Western union money transfer కొంచం different గా ఉంటుంది. మనం దీని ద్వారా 10 నిముషాలలో డబ్బు ఇండియా పంపవచ్చు, కాకపోతే దీనికి service charge చెల్లించవస్తుంది. నాకు తెలిసి మొదటి 500$ కి 10$, ఆతరువాత ప్రతి 100$ కి 1$ చొప్పున service charge చెల్లించవస్తుంది. ఈపద్దతి ద్వారా పంపగోరువారు ఇండియా లో Banks లోనే కాకుండా, Western Union agents ద్వారా ఇండియాలో ఎక్కడైనా డబ్బుని పొందవచ్చు. ఈపద్దతి ద్వారా డబ్బుని పంపించాలి అనుకొనేవారు దగ్గరలోఉన్న ఏ Western Union money transfer facility ఉన్న mall / shop / travel agency / bank నుంచి పంపించవచ్చు.
ఇండియాలో డబ్బు ఎలా తీసుకోవచ్చు: ఇండియాలో డబ్బు తీసుకొనే వారి వివరములు మనం అమెరికా లో money transfer form లో ఇవ్వవలసి ఉంటుంది. మనం counter లో money ఇచ్చిన తరువాత, మనకి receipt ఇస్తారు.దానిలో మనకి receiver information ఉంటుంది, దానితో పాటు receipt మీద ఉన్న code, ఇండియాకు పంపించిన డబ్బు వివరాలు ఇవన్నీ మనం ఇండియాలో డబ్బు తీసుకొనేవారికి తెలియచేయాల్సి ఉంటుంది. అదే receiver డబ్బు తీసుకొనటానికి వెళ్ళినప్పుడు తన identity ని మరియు పైన వివరాలు చెప్పవలసి ఉంటుంది. 50000 కంటే ఎక్కువ అయితే డబ్బుగా తీసుకోలేము, DD గా మాత్రమే తీసుకోగలము.
Western union money transfer వలన లాభాలు:
1) ఇండియా లో డబ్బు వెంటనే తీసుకొనవచ్చు.
2) Conversion rate మనకి సరిగ్గా తెలుస్తుంది.
3) Agents చాలా మంది ఉంటారు కాబట్టి, చాలా తేలికగా డబ్బు పొందవచ్చు.
Western union money transfer వలన నష్టాలు:
1) Service charge పే చేయవలసి వస్తుంది.
2) Conversion rate కూడా పైన పద్దతిలో కంటే తక్కువగానే వస్తుంది.
పైన చెప్పబడిన వివరములు నా అనుభవాల సారాంశం మాత్రమే...
0 comments:
Post a Comment