Saturday, December 8, 2007

కారు లోన్ తీసుకోవటం ఎలా?

బ్యాంకు లోను ద్వారా కారు కొనాలనుకొనేవారికి కొన్ని సూచనలు:

ఏ బ్యాంక్ లో లోను తీసుకోవాలి: అమెరికా లో చాలా బ్యాంక్ లు కారు లోన్లు ఇవ్వటానికి సుముఖముగా ఉన్నప్పటికి, ఏ బ్యాంక్ లో లోను తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమయిన అంశం. తక్కువ వడ్డీ తో రుణాలు ఇచ్చే బ్యాంకుల లో Credit Unions పాత్ర చెప్పుకోదగినది. Credit unions చాలా ఉన్నప్పటికి నాకు తెలిసినవి Northwest Federal Credit Union మరియు Digital Federal Credit Union (DCU) మాత్రమే. Credit Unions complete network ని చూడాలనుకొంటె ఇక్కడ CLICK చేయండి.

Credit Unions లో రుణాలు తీసుకోవటం వలన లాభాలు:
  1. APR ( వడ్డీ) తక్కువగా ఉంటుంది. (నేను 4.99 A.P.R కి Car Loan పొందగలిగాను)
  2. Credit unions network లో దేనిద్వారా అయినా మనము లావాదేవీలు చాలా సులభముగా చేయవచ్చు. (అంటే ఉదాహరణకి నాకు NFCU లో account ఉంది, వ్రుత్తిరీత్యా మనం చాలా cities కి వెల్తుంటాము, ఆ వెళ్ళినచోట నాకు account ఉన్న NFCU లేనప్పటికి మనకి దగ్గరలో ఉన్న ఏ credit union ద్వారా అయినా మనం ఉచితంగా లావాదేవీలు నడపవచ్చు.)
లోను ఎంత పొందవచ్చు: నేను 25000$ లోనుగా పొందాను, నాకు ఆ Credit Union లో Credit card ఉండబట్టీ చాలా తేలికగా కొంచం ఎక్కువ మొత్తమే పొందగలిగాను. ఆయా Credit Union లో మనం ముందుగానే account తెరిచి లావాదేవీలు నడిపితే తద్వారా సులభంగా లోను పొందే వీలుంటుంది.

లోను తీసుకొనే విధానం: ముందుగా మనం సంబదిత Credit union కి phone చేసి మనం ఎంత లోను తీసుకోవటానికి అర్హులమో తెలుసుకోవాలి. మనం account తెరిచిన తర్వాత salary పెరిగినట్లయితే, మన latest paystubs తిరిగి బ్యాంక్ కి అందచేస్తే మనం మరింత ఎక్కువ రుణం పొందే అవకాశముంటుంది. లోను ఎంత వస్తుందో తెలిసిన తర్వాత Loan Pre-approved document ముందుగానే తీసుకొంటే మంచిది. ఈ Loan Pre-approved document ద్వారా మనం 30 నుండి 60 రోజులలో కారు కొనవచ్చు. మనం డీలర్ దగ్గర కారు finalize చేసిన తరువాత, డీలర్ దగ్గర నుండి quotation తీసుకొని బ్యాంక్ కి పంపితే మనకి వారు డీలరు పేరు మీద ఆ amount కి చెక్ పంపిస్తారు. కారు కొన్నతరువాత title change అయ్యినతరువాత ఆ title change - original document మరల బ్యాంక్ కి పంపించవలసి ఉంటుంది.

మీకు పైన ఇవ్వబడిన సమాచారంలో ఎమన్నా సందేహాలు ఉంటే: mail me at ap2usblog@gmail.com







0 comments:

New 2 U.S group - Share your experiences

Google Groups
Subscribe to New 2 US
Email:
Visit this group