కారు కొనాలని అనుకొంటున్నారా...
అన్నీ సక్రమంగా జరిగి కారుకొనటానికి సిద్దమయినవారికి మా సూచనలు...ముందుగా ఏ కారు కొనాలి, ఎంతలో కొనాలి అనేది ముఖ్యమయిన విషయం.
ఏ కారు కొనాలి: ముఖ్యంగా Japanese cars ఎక్కువగా మన్నుతాయని ప్రతీతి. ఆందుకే మన వాళ్ళలో ఎక్కువ మంది Toyota, Honda & Nissan వైపుకి మ్రొగ్గుచూపుతారు. ఇక మిగతా కారులు గూర్చి ఆలోచించే వారికి అమెరికాలో దాదాపు 60 నుంచి 70 కంపెనీలు ఉన్నాయి.
ఏవిధమయిన కారు కొనాలి: ఇక్కడ Sedan, Coupe, Convertible, SUV ఇలా రకరకాలుగా విభజించబడినవి. మా ఉద్దేశం ప్రకారం Newly married family కి Sedan బాగుంటుంది, ఇక single అయితే మిగతా వాటితో పాటు Coupe & Convertible కూడా ఉపయోగించవచ్చు. ఇక kids ఉన్న family అయితే SUV చక్కగా సరిపోతుంది.
ఎంతలో కొనాలి: ఎక్కువ కాలం అమెరికాలో స్థిరమవుదామని ఆలోచన ఉన్నవారు క్రొత్త కార్ (Around $23000 )తీసుకోవటం మంచిది. Short term plans ఉన్నవారు Used car ($6000 - $8000) తీసుకొవటం మంచిది. 2 cars తీసుకొందామనే idea తో ఉన్నవారు ముందుగా used car ని తీసుకొని, తరువాత క్రొత్త car తీసుకొవటంలో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. Auto classifieds కొసం visit www.cars.com మరియు www.craigslist.com .
ఎలా కొనాలి: New car కొనాలి అనుకొనే వారు కావలిసిన Model ని select చేసుకొని (You can see interiors and exteriors in the corresponding website.)దగ్గరలో ఉన్న వివిధ Car Distributors వద్ద నుంచి price మరియు ఇతర విషయాలు సేకరించి, వాటిలో మనకి నచ్చిన vendor నుంచి కొనిగోలు చేయవచ్చు. ఇక Used car కొనాలి అనుకొనే వారు కావలిసిన Model ని select చేసుకొని, ముందుగా present market rate (www.kbb.com) తెలుసుకోవాలి. Direct owners నుంచి కోనేటప్పుడు మరింత జాగ్రత్త గా ఉందటం ఎంతయినా మంచిది, ఇలా కొనాలి అనుకొన్నప్పుడు తెలిసిన వ్యక్తుల వద్ద నుంచి కొనటం చాలా ఉత్తమమయిన ఆలోచన. ఇక Used cars dealer వద్ద నుంచి కొనేటప్పుడు మిగతా Dealers తో compare చేసి Car ని కొనటం మంచిది. కొనేముందు మనం Test drive కూడా చెయ్యవచ్చు. ఇక Engine కి సంబందించి, Car గురుంచి బాగా తెలిసిన వారిని వెంటపెట్టుకొని చూడటం మరీ మంచిది. క్రొత్త models కి ఎక్కువమంది car dealers guarantee ఇస్తారు, మనకి ఎమన్నా engine పై doubt ఉంటె dealer దగ్గరే Insurance చేయించుకోవటం మంచిది. Name plate (Car registration) change కి Legal documents prepare చేసుకొవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి Temporary registration (around 7$ per month) తీసుకొవటం మంచిది. Dealer will charge car price + dealer charge + tax + registration charge approx + temporary registration charge + Insurance (engine / bumper 2 bumper).
Name plate change (Car registration process): మన పేరు మీద car registration చెసుకోవటానికి కావలిసిన legal documents state to state మారుతాయి. Dealer registration charge కూడా ముందుగానే స్వీకరించిన సంధర్భంలో, Dealer మనకి వారి cheque ఇస్తారు, దానిని మనం name plate change (car registration process) చేసే సమయంలో మిగతా required documents తో పాటుగా జతచేయాలి. మనం మన name plate ని మనకి ఇష్టమొచ్చినట్లు గా రూపొందించుకోవచ్చు, అలా చేయించుకొవాలి అంటె కొంత ఎక్కువ ఖర్చవుతుంది.
ఇట్లు మీ: సత్యసురేష్ దోనేపూడి.
0 comments:
Post a Comment