Friday, December 7, 2007

హ్యపీ డేస్


2 రోజుల క్రితం మా క్లోస్ ఫ్రెండ్ సురేంద్ర ఇండియా నుంచి కాల్ చేసి 'హ్యాపీ డేస్ ' తప్పని సరిగా చూడమని చెప్పటంతో, వీలైనంత త్వరగా ఆ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. లక్కీగా నిన్నే ఆ సినిమా మా సిటీ కి రావటంతో కొలీగ్స్ అందరం డిస్కర్స్ చేసుకొని ఒక 8 మంది ట్రూప్ కలసి 'హ్యాపీ డేస్ ' కి బయలుదేరాము.

హాలు బయట అంత జనసముదాయం లేక పొవటంతో కొంత రిలాక్స్ గా ఫీల్ అయ్యాం, ఇక హాలు లోకి వెళ్ళి చూసే సరికి పరిస్తితి వేరుగా కనిపించింది. అల్రెడీ సీట్లు కొసం వెతకి వేసారిపొయిన వాళ్ళందరు ఇక వాళ్ళవల్ల కాదన్నట్లు గా ఒక ప్రక్కన నిలుచుని ఉండగా, మేము మాత్రం మాప్రయత్నాల్లొ మునిగాం, ఇంతలొ మాకొసమే సీట్లు ఆపినట్లుగా అప్పటి వరకు మా ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పిన కొంతమంది వాటిని కాళీ చేసి మాకు ఇవ్వటంతో హ్యాపీగా ఆక్యుపై చేసాం. ఇక సినిమాలో కి వెళితే...

సినిమా రివ్యూ : కథ లో కొత్తదనం లేకపొయినా కథనం లో కొంత కొత్తదనం కనిపించింది. అందరూ కొత్తవ్వారవ్వటంతో ఫ్రెష్ లుక్ బాగా కనిపించింది. యూత్ ని ఆకట్టు కోవటంలో శేఖర్ కమ్ముల సఫలీక్రుతుడయ్యడనే చెప్పాలి. మాటలు చాల బాగా వ్రాసిన శేఖర్ కమ్ముల కి నిజంగా హ్యట్సాఫ్. మన కాలేజ్ డేస్ గురించి తీసిన సినిమా కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఆజ్ఞాపకాలిలోకి వెళ్ళటం ఖాయం. ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వ్యాల్యూ ఇచ్చే టైసన్ పాత్ర, ఫన్నీ గా ఏవిషయానికయనా ఎక్కువగా రియాక్ట్ అయ్యే రాకేష్ పాత్ర, ఎవరివిషయాలూ నాకు పట్టవ్ నా విషయాలు మీకు అనవసరం అంటూ ఫ్రెండ్షిప్ కంటే వ్యామొహం గొప్పదన్నట్లుగా కొంచం స్వార్ధ పూరితమయిన పాత్రలో శంకర్, అన్నిటిని సమపాళ్ళలో మైంటైన్ చెసే మైన్ పాత్రలో చందు మరియు వీరందరినీ లవ్ ట్రాక్లో నడపటానికి మరో 4 భామలు, ఇక స్పెషల్ గా కనిపెంచే లెక్చరర్ పాత్రలో కమలిని ముఖర్జి అందరిని ఆకట్టుకొన్నాయి.

ఇక పాటల విషయానికి వస్తే 'అరెరే' అనే పాట, మాటలనే పాటగా పాడి న 'జిల్ జిల్ జిగా', చాలా అర్థవంతమైన పదజాలంతో సగిపొయే 'ఒ మై ఫ్రెండ్, టైటిల్ సాంగ్ 'హాపీ డేస్ ', గ్రూప్ సాంగ్ 'సైనారా' వీటన్నిటిలొనూ సంగీత దర్శకుడు మిక్కి జె మెయొర్ కొత్తదనం కొట్టొచ్చిన్నట్లు కనిపించింది.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మరియు నిర్మాత గా శేఖర్ కమ్ముల తన స్థానం పదిలపరచుకొవటంలో వందశాతం సఫలీక్రుతమయినట్లు అనికొవచ్చు.

ఇట్లు మీ: సత్యసురేష్

0 comments:

New 2 U.S group - Share your experiences

Google Groups
Subscribe to New 2 US
Email:
Visit this group