Friday, December 7, 2007

కౄతజ్ఞతల దినం



Thanks giving day - ఎందుకు జరుపుకుంటాం?

మనకి సంక్రాతి ఎలాగో,అమెరికా లో పంటలు చేతికి వచ్చిన సందర్భంగా Thanks giving day ని జరుపుకొంటారు. ఇక చరిత్రలో కి వెళితే - ఇతర దేశాలనుండి అమెరికా వచ్చి స్థిరపడినవారు పంటలు చేతికి వచ్చిన వేళ భగవంతుని ప్రార్ధిస్తూ జరుపుకొనే పండుగ ఇది, అయితే ఎక్కడినుండో ఇక్కడికి వచ్చి స్థిరపడటానికి మరియు ఇక్కడ పంటలు ఎలాపండించాలో తెలియజెప్పిన Red Indians కి క్రుతజ్ఞతగా ఇచ్చే విందు సందర్భమే ఈ Thanks giving day. ఈ విందులో ముఖ్యమయినది టర్కీకోడి, అదే Thanks giving day చిహ్నంకూడా.

Thanks giving day మొట్ట మొదట 16 వ శతాబ్దంలో మొదలయింది. 1863 వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ పండుకకు ఒక ప్రత్యేక దినంగా దీనికి నవంబర్ నెలలో ఆఖరి గురువారాన్ని ప్రతిపాదించారు. అయితే ఆ తరువాత ఈ Thanks giving Day ని చాలా సార్లు మార్చారు, ఇక చివరిగా 1941 వ సంవత్సరంలో దీనిని 'నవంబర్ నెలలో 4 వ గురువారం ' దీనిని జరుపుకోవాలని అమెరికన్ కాంగ్రెస్ ద్రువీకరించింది.

Happy shopping.

ఇట్లు: సత్యసురేష్ దోనేపూడి.

0 comments:

New 2 U.S group - Share your experiences

Google Groups
Subscribe to New 2 US
Email:
Visit this group