విజయదశమి

విజయదశమి కథ:
మహిషాశురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుని ధ్యానిస్తూ ఘోరమయిన తపస్సుచేసాడు. చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఘోరమయిన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాశురుడిని అడిగాడు. కపట బుద్దితో ఉన్న మహిషాశురుడు ఎప్పటికి చావులేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుని వేడుకొన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కొరుకో అని అనటంతో,
మహిషాశురుడు ఇలా ఆలోచించసాగాడు, మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపొయాను కాని మరణాన్ని పొందకుండా ఉండటానికి మరే విధమయిన మర్గాలున్నాయా అన్నట్లు ఆలోచించి, స్త్రీలు పురుషులతొ సమ ఉజ్జీలు కాదుకాబట్టి, వారు శాంతస్వరూపులు కాబట్టి వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్నీ ఈవిధముగా కోరుకొంటే బాగుంటుండి అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవా స్త్రీ చేతులలోనే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కొరుకొన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు, అటులనే తధాస్థు అని మహిషాశురుడు కోరుకొన్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడినుంచి అద్రుశ్యమయ్యాడు.
దాదాపుగా మరణమే లేని వరం పొందామనే ఆనందతో మహిషాశురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు మహిషాశురుడు, కొంతకాలానికి ఆయనకు ఒక దుష్టమయిన ఆలోచన వచ్చింది, అది ఏమిటంటే తనకు పురుషులతో ఎటూ మరణం లేదు కాబట్టి దేవతల లోకమయిన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని.
సైనికులారా విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదముట్టిద్దాం అంటూ ఇంద్రలోకం పై దండెత్తాడు.
ఈవిషయం తెలుసుకొన్న ఇంద్రుడు చాల కోపంతో తన సైనికులని కూడా యుద్దానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు.
చాలా సార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికి విజయం సాధించలేకపొయారు, కాని ఈసారి ఆ భయంకరమయిన యుద్దములో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయంపాలై ఇంద్రలోకాన్ని విడిచి పలాయానమయ్యాడు.
ఇక ఇంద్రలోకాన్ని అదిష్టించిన మహిషాశురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగసాగాడు, భూలొకంలో దేవాలయ్యాల్లో దేవతల విగ్రహాలన్నిటిని తొలగించి ఆ స్తానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవరూ యజ్ఞ యాగాదులు చేయరాదని, అందరూ తననే స్థుతించాలని ఆజ్ఞాపించాడు అలా చేయనివారిని నానా అగచాట్లు పెట్టటం ప్రారంబించాడు. మహిషాశురుని విపరీతక్రుత్యాలకి వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలసి ఈ భాదలనుంచి విముక్తి పొందటానికి కైలాసానికేగి భోలాశంకరుడికి మహిషాశురుని అక్రుత్యాలు వివరించారు.
అప్పుడు భోలాశంకరుడు తన దివ్యద్రుష్టితో మహిషాశురుడి శక్తి ని పరీక్షించి, మహిషాశురుడు బ్రహదేవునితొ వరంపొందటం వల్లన, మరియు సహజంగానే అతను శక్తివతుండవ్వటం వల్ల మహిషాశురుడిని తుదముట్టించటానికి త్రిమూర్తుల అందరిశక్తి అవసరమని గ్రహించారు. అటుపిమ్మట బ్రహ్మదేవుని, విష్నుదేవుని కలసి త్రిమూర్థుల శక్తి తో అఖండ శక్తి వంతమయిన స్త్రీని సౄష్టించారు.
వేయిచేతులతో అత్యంత శక్తివంతురాలిగా సౄష్టించబడిన ఆమే కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిసూలం సౄష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్నుభగవానుడు తన విష్నుచక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుదాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలిని కనకదుర్గాదేవికి ఇవ్వగా సర్వ శక్తివంతమయిన కనకదుర్గాదేవి ఉగ్రస్వరుపురాలై గర్జించే సిం హాన్నే వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీకరమయిన పోరులో మహిషాశురుడు దున్నపోతు రూపందాల్చి కనకదుర్గాదేవి పై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాశురుడి శిరస్సు చేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది.
కథ సారాంశం: చెడు పై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశముగా మనం ఈ పండుగ జరుపుకొంటాం. తొమ్మిది రోజులు ఘొరమయిన రణం తరువాత విజయం సిద్దించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకొంటాము.
చెడు తాత్కాలికంగా విజయం సాదించినప్పటికి అంతిమ విజయం మంచిదే, కాబట్టి శాశ్వతమయిన మంచిని పొందటానికే మన ప్రతి ప్రయత్నము సాగిద్దాం.
విజయదశమి సుభాకాంక్షలతో: సత్యసురేష్ దోనేపూడి.
0 comments:
Post a Comment