Friday, December 7, 2007

హాలోవీన్ - యూరప్ పండుగ అమెరికా లో...



రేపు (అక్టోబర్ 31) హాలోవీన్ కాబట్టి మనం కాసేపు దానిగూర్చి మాట్లాడుకొందాం.

ఇది చిన్నపిల్లల పండుగ, ఈ పండుగ యూరప్(ఐర్లాండ్)లో పుట్టి 19 వ శతాబ్దంలో అమెరికా కి పాకింది. ఈ పండుగని వెలుతురుకి వీడ్కోలు గా చలి మరియు చీకటికి అహ్వానంగా జరుపుకుంటారు.

చరిత్ర: అక్టోబర్ 31 వచ్చేసరికి రైతులకి పండిన పంటలు చేతికి వస్తాయి, ఆ ఆనంద సమయంలో అర్థరాత్రి వారు దట్టమయిన అడవిలో ఎత్తైయిన కొండమీదికి సమూహంగా చేరుకొని పెద్ద పెద్ద మంటలు వేస్తారు, ఆ మంటలిలో పండిన పంటలిని మరియు జంతువులని బలిచ్చి, విందుని ఆరగిస్తారు. ఆరొజు రాత్రంతా అలా మంటలు చుట్టూ నౄత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఆ మరుసటి ఉదయం ఆ మండిన చెక్కలని ఇండ్లకి తీసుకువచ్చి చుట్టుపక్కలివారికి, శ్రేయొబిలాషులకు పంచిపెడతారు.

ఇక రాబోయేది చలికాలం కనుక ఇంటికి తీసుకువచ్చిన కాలిన చెక్కలతో నిప్పు వెలిగించుకుని ఇంటిని వెచ్చగా ఉంచుకొంటారు, ఆ కాలిన చెక్కలతో నిప్పు వెలిగించుకోవటం వల్ల దుష్టశక్తులు దూరంగా ఉంటాయని కూడా ఒక నమ్మకం.

ఈతరం పండుగ: ఈ పండుగ 3 రోజులు జరుపుకొంటారు, పాత తరం పండుగ, ఆ సాంప్రదాయాలు మరుగునపడిపోయాయి, ఈతరంలో ఈపండుగ చిన్న పిల్లలకి మాత్రమే పరిమితమయిపోయింది. చిన్న పిల్లలు ఈ పండుగ సందర్భంగా వివిధ రకాల వేషాలు ధరిస్తారు, ముఖ్యంగా జంతువుల తలలు ధరించి తెలిసిన వారింటికి వెళ్ళి Trick or Treat అని అడుగుతారు Trick అంటే వారు ధరించిన వేషాన్ని బట్టి ఆయా జంతువుల శబ్ధాలిని అనుకరిస్తారు, Treat అంటే మనం వారికి Cande (చాక్లెట్లు) ఇవ్వాలనమాట. ఈ పండుగ Hollow even గా ప్రారంభమయ్యి Holloween అయిపోయింది.

ఇట్లు: సత్యసురేష్ దోనేపూడి.

0 comments:

New 2 U.S group - Share your experiences

Google Groups
Subscribe to New 2 US
Email:
Visit this group